Sunday, February 20, 2022

 



శ్రీ పంచమి భావుక కవిత ల పోటీ  (February 4, 2019) 

శీ దేవీ శారదే నమోస్తుతే
శ్రీ దేవీ శారదే నమోస్తుతే
శ్వేతాంబరధారీ నమోస్తుతే//
1. ఓంకార నాదమే సప్త స్వరాలై
స-రి-గ-మ-ప-ద-నీ..,..
సప్తస్వరాలే   సర్వమై, సమస్తమై
సదా నను పాలించవే-  సువాణీ‌,సరస్వతీ//
2. సంగీత సాధనే   - నా ఆరాధన గా
రాగాలాపనే - నా ఆరగింపుగా
నా మనసే నీ నివాసముగా
సదా నను ఆదరించవే...హంసవాహినీ, సరస్వతీ//
3. శ్రీ వాణీ, వాగ్వాదినీ - వేదనాయికే
సాహితీ  శర్వాణీ-  శ్రీమయీ, శారదే
సదా నాకభయమియ్యవే - మా తల్లీ
పద్మార్చిత  స్వరాంబుజవల్లీ -సరస్వతీ//

( ప్రత్యేక బహుమతి - Feb 9th 2019)