Sunday, October 11, 2009

కామన్ సెన్స్

ప్రవసాన్ద్రులం ఏదైనా సభలోగాని. సినిమాలో గాని, ఎక్కడైనా .ఎప్పుడైనా కలుసుకుంటే కబుర్లు చెప్పుకోడం సహజమే.
మనవాళ్ళు దేనికైనా సమయం, సందర్భం చూడాలని అంటారు. అది నిజం సుమా. ఈమధ్య నేను ఒక కచ్చేరికి వెళ్ళాను. వేదిక మీద కళాకారిణి అధ్బుతంగా పాడుతుంటే ఇక్కడ నా పక్కనే ఉన్నావిడ వెనకావిడతో దోసావకాయ పెట్టడం గురించి డిస్కస్ చేస్తోంది. ష్హ్హ్హ్హ్హ్........ ఆవిడ లెక్కచేయలేదు. నేను మరోచోటుకి వెళ్లి కూర్చున్నాను.
ఎన్నోసంవత్సరాలు కృషి చేస్తేనే పరిపూర్ణ కళాకారుడవుతాడు. వారికి మన చప్పట్లే స్పూర్తి . ఆ చప్పట్లు ఆ సభ నిర్వాహకులు చెబితేనే కొడతాం .... అదీ వినీ వినపడకుండా..... ఇందులోనూ పొదుపే ...
హాయిగా ఆనందిచండి ...మీ పక్కవాళ్ళని విసికించకుండా ....
మనస్పూర్తిగా ఆ కళాకారుడిని అభినందించండి.
దీనికి మీరు పెట్టె ఖర్చు ఐదు నిమిషాల కంటే తక్కువే.
ఆలోచించండి...

Saturday, October 10, 2009

Hello

హలో ఫ్రెండ్స్!!

నేను ఇప్పుడే నా బ్లాగ్ మొదలు పెట్టాను. నేను న్యూ బొంబాయి లో ఉంటాను. నా భావాలు మీతో పంచుకోవాలని ఈ
బ్లాగ్ మొదలు పెట్టాను.

ధన్యవాదాలు
పద్మ