Sunday, July 31, 2011
bhandhalu - anubhandhalu
జీవి కడుపులో పడిన దగ్గరనుండి బంధాలు మొదలుతై . పేగు బంధం తరువాత సోదర బంధం ఆ తరువాత స్నేహ బంధం .... వివాహ బంధం దీంతో చాల కొత్త బంధాలు చుట్టుకుంటై. భార్యగా, కోడలిగా, మరదలుగా, అత్తగా..... ఇలా ...రకరకాల బంధాలు. మొదట్లో కొత్త కోడలు అత్తవారింట్లో తనకంటూ ఒక స్తానం లేక ఒక వ్యక్తిగా గుర్తించాలని అనుకుంటుంది. ప్రయత్నం చేస్తుంది. కోడలిగా షష్టిపూర్తి చేసికున్నా ఆమె అత్తవారింట్లో సెకండ్ గ్రేడ్ సిటిజెన్ గానే ఉంటుంది. ఆమెకు ఒక మనసు ఉంటుంది. ఆశలున్టై ఆశయలున్టై అని ఎంతమంది ఆలోచిస్తారు? పెళ్ళితో పుట్టింటితో సంబంధం వదేలేయలా? కష్టం వచ్చినప్పుడు పుట్టిన్తివల్లె చెయ్యాలి. తరువాత వాళ్ళను మర్చిపోవాలా? అడిగినప్పుడల్లా డబ్బులిస్తే బంధాలు అనుబంధాలుగా ఆప్యాయంగా ఉంటై. లేకపోతె కోడలు కొడుకుని కొంగున ముడి వేసుకుంది. అసలు ఈ బంధాలన్నీ డబ్బుల చుట్టే తిరుగుతున్నాయి అనిపిస్తుంది. స్వార్ధం నిండిన బంధాలు నిజబంధాలని కప్పివేస్తున్నాయి.
కోతి మనసు
అబ్బా ఈ మనసుంది చూసారు దేనిగురించి ఆలోచించకూడదు అనకుంటే దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సాలేగుడులో చిక్కుకున్న్న జీవిలా కొట్టుతుంటూ ఉంటుంది. సానుభూతి ఆశించకూడదు అని చాల దృడంగా నిచ్చైన్చుకున్నా , నా వాళ్ళు అనుకున్నవారు అంటి ముట్టనట్లు ఉంటుంటే మనసుకి కష్టంగా అన్పిస్తుంది. పైకి మామూలుగా , నార్మల్ గా ఉన్నట్లుగా ఉన్నా, ఈ కోతి మనసులో సవా లక్ష సందేహాలు సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎదుటివారు మాట్లాడిన మాటల్లో కొత్త అర్ధాలు వినిపిస్తూ, అసలు విషయం మరుగు పడుతుంది. పోన్లే మనం మాములుగా, స్వచ్చంగా , అభిమానంగా మాట్లాడితే , వాళ్ళేమనుకుంటారో అని మనసులో భీతి. ఈలాగా రకరకాల సంకెళ్ళతో మనకి మనం చుట్టేసుకుంటాం. ఎంత వరకు ఎదుటివారిని నమ్మగలం ? కుప్పి గంతులు వేసే ఈ మనసుని ఎలా కంట్రోల్ చెయ్యగలం?
Subscribe to:
Posts (Atom)