Thursday, May 13, 2010

ఓ మనసా....

ముందోకలాగా వెనకోకలాగా ప్రవర్తిస్తుంటారు చాలామంది. మొహం ముందు నీ అంతటి వాడు లేడంటూ , చాటుగా వీడంత వెధవ లేదంటారు.
అసలు ఈ మనసుంది చూసారు.. మన్ని కోతి కోమ్మచ్చులడిస్తుంది. దేన్నీ మరచిపోవాలని అనుకొంటా మో దాన్ని గుర్తుచేస్తూనే ఉంటుంది.
ఈ మధ్య ఒకావిడ అలాగే తెగ దేబ్బలాడేసి, అందరు ఉన్నప్పుడు తెగ ప్రేమని ఒలక బొసింది, అక్కడికి
తను,నేను గొప్ప స్నేహితులమనట్లు. మా మధ్య ఏమి జరగనట్లు. ఆవిడ నటనకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. అంతలా దున్నేసి పారేసింది. నేను తమాయించుకొని, ఆ నాటకాన్ని నెనూ కంటిన్యూ చేసాను. లోపల కుతకుతలడుటున్నా, నవ్వు ముఖం పెట్టుకుని, ఆ ప్రోగ్రాం ఐపోయంతవరుకు ఓపిక పట్టా. ముందు కోపం వచ్చింది ఇంటి కి వచ్చి శాంతంగా ఆలోచిస్తే ...
అసలు నా కెందుకు కోపం రావాలి ?ఆవిడ స్వభావం అది. నేను నేర్చుకోవలసినది దేనికి చలించకుండా ఉండడం. అవిడన్న మాటలనే పట్టుకుని పదే పదే దాన్ని గురించే ఆలోచిమనంస్తుంటే నా ఆరోగ్యమే పాడవుతుంది, ప్రతీకారం తీర్చుకోవలనిపిస్తుంది మనం రగలిపోతుంటే దాని ప్రభావం తప్పకుండా మనింట్లో ప్రతిబింబిస్తుంది. ఆందుకే ముందు బాధనిపించిన తరువాత సర్దుకుంటే అందరికి మంచిది.. మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది.
ఆందుకే కుప్పి గెంతులు వేసే మనసుని పగ్గాలు వేసి పట్టుకుంటే మంచిది.
మనసా కవ్వించకే ననన్నిలా...